ప్రభుత్వ విప్ కి జర్నలిస్టుల సమస్యల్ని నివేదించిన ఏపీబీజేఏ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును ఏపీబీజేఏ నాయకుడు పఠాన్ మీరా హుస్సేన్ ఖాన్ బృందం కలిసింది. ఏపీలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయనకు నివేదించింది. కరోనా కష్ట కాలంలో ప్రంట్ లైన్ వారియర్స్ లా జర్నలిస్టులు తమ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి వార్తా సేకరణ చేస్తున్నారని జర్నలిస్టు నేత మీరా హుస్సేన్ ఉదయభానుకు వివరించారు. ఏపీలో జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో అక్రిడిటేషన్ ఇవ్వాలని, చిన్న పత్రికలకు ఎటువంటి తీవ్ర ఆంక్షలు లేకుండా గుర్తింపు ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భానును మీరా హుస్సేన్ కోరారు.
ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును ఆయన స్వగృహంలో కలిసిన ఏపీబీజేఏ నాయకుడు పఠాన్ మీరా హుస్సేన్ ఖాన్ బృందం ఆయన్ని ఘనంగా శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఉదయభాను సతీమణి, విమలభానును కూడా మర్యాద పూర్వకంగా కలిసిన జర్నలిస్టు సంఘ రాష్ట్ర నాయకులు పి.మీరాహుస్సేన్ ఖాన్ బృందం ఆమెను కూడా శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాలు అందజేసి చిరుసత్కారం చేశారు. ఉదయభానుకి మీరాహుస్సేన్ స్వీట్లు తినిపించారు. జర్నలిస్టుల సమస్యలను తెలియజేయగా, తాను ప్రభుత్వ విప్ గా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఉదయ భాను హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పఠాన్ సైదాఖాన్, న్యాయవాది పఠాన్ కరీముల్లా, అల్లావుద్దీన్. నరేంద్రనాయక్, ఎలిషా తదితరులు పాల్లొన్నారు.