ఆమ్లెట్ తీసుకుని మేడ పైకి రా, 10 నిమిషాలు నాతో గడుపు: నర్సుకి వైద్యుడు వేధింపులు

omlet
ఐవీఆర్| Last Updated: గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:56 IST)
మహిళలపై వేధింపులు ఆగడంలేదు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధులు వాటిని చూసి భయపడటంలేదు. తమ వాంఛలను తీర్చుకునేందుకు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న నర్సుకి వైద్యుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి.

బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా వున్నాయి. ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో రవీంద్ర నాథ్ ఠాగూర్ అనే వ్యక్తి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన స్టాఫ్ నర్సుకి సదరు వైద్యుడు కాల్ చేసి తనకు ఆమ్లెట్ కావాలని ఆఫర్ చేశాడు. అందుకు సరేనంటూ ఆసుపత్రి సిబ్బందిని పంపిస్తే ఆమ్లెట్ పంపుతానని చెప్పింది.

ఆసుపత్రి సిబ్బంది కాదు.. ఆమ్లెట్ తీసుకుని నువ్వే ఇక్కడికి రా అని కోరాడు. దానితో ఆమె ఆమ్లెట్ తీసుకుని ఆసుపత్రికి వెళ్లింది. ఇంతలో మళ్లీ ఫోన్ చేసి మేడపైన గదిలో వున్నాననీ, ఆమ్లెట్ తీసుకుని పైకి వచ్చి తనతో 10 నిమిషాలు ఏకాంతంగా గడపాలంటూ అడిగాడు. వైద్యుడి మాటలతో షాక్ తిన్న నర్సు విషయాన్ని ఇంట్లో తెలిపింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి వైద్యుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.దీనిపై మరింత చదవండి :