మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 29 జనవరి 2020 (22:44 IST)

పాలమ్మాయిని ట్రాప్‌లో పెట్టిన డాక్టర్.. భార్యాపిల్లలను వదిలేసి..?

ప్రజల ప్రాణాలు కాపాడే పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్ కీచకుడిగా మారాడు. పెళ్లయి పిల్లలుండి కూడా ఓ మైనర్‌ బాలికపై కన్నేశాడు. ఆమెను మాయమాటలతో లొంగదీసుకుని కుటుంబాన్ని వదిలేసి పరారయ్యాడు. భర్త నిర్వాకంతో డాక్టర్ భార్య లబోదిబోమంటోంది. 
 
బిహార్‌లోని మాదెపురా జిల్లాలోని కుమార్‌ఖండ్ ప్రాంతానికి చెందిన ధనుంజయ్ అనే వ్యక్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డెంటిస్ట్‌గా పనిచేసేవాడు. భార్య, పిల్లలతో కలిసి అదే ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఇటీవల అక్కడ పని మానేసి కుమార్‌ఖండ్ మార్కెట్ ప్రాంతంలో సొంతంగా క్లినిక్ ప్రారంభించాడు. అతడి ఇంటికి బిజేంద్ర యాదవ్ అనే వ్యక్తి పాలు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య స్నేహం ఏర్పడింది.
 
దీంతో బిజేంద్ర కుమార్తె తరుచూ డాక్టర్ ఇంటికి వెళ్లేది. దీంతో బాలికపై కన్నేసిన బిజేంద్ర ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆమెకు కావాల్సిన వస్తువులు కొనిపెడుతూ శారీరక వాంఛలు తీర్చుకునేవాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. అదే సమయంలో ధనుంజయ్ కూడా కనిపించడం లేదని అతడి భార్య స్థానికులకు చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దర్యాప్తు చేసిన పోలీసులకు షాకిచ్చే నిజం తెలిసింది. ధనుంజయ్ బాలికను వంచించి తీసుకుపోయినట్లు తేలింది. దీంతో ఆ కీచకుడిని ఎలాగైనా పట్టుకోవాలని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన జీవితాన్ని నాశనం చేసిన భర్తపై కఠినచర్యలు తీసుకోవాలని డాక్టర్ భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.