మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 మే 2021 (20:16 IST)

తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో అగ్నిప్రమాదం, ఒకరు సజీవ దహనం

తిరుమల: తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటల ధాటికి దాదాపు 20 దుకాణాల్లో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలో ఓ దుకాణదారుడు సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, తితిదే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. శకలాలు తొలగిస్తుండగా మృతదేహం బయటపడింది. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.