మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 28 జనవరి 2019 (10:18 IST)

ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్యా యత్నం...

ప్రియుడు మోసం చేశాడంటూ యువతి ఆత్మహత్యాయత్నం చేయడంతో భయపడిన యువకుడు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. కృష్ణా జిల్లా తిరువూరులో దారుణం జరిగింది. ప్రేమ విషయంలో తనను ఓ యువకుడు మోసం చేశాడని భావించిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, ఈ విషయం తెలిసిన యువకుడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
తిరువూరుకి చెందిన తగరం నవ్య అనే యువతి, కొత్తపల్లి డాని అనే యువకుడు ప్రేమించుకున్నారు. అయితే, తనను నాని మోసం చేశాడంటూ నవ్య నిద్రమాత్రలు మింగింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు నాని, నవ్య.
 
మరోవైపు నవ్య ఆత్మహత్య యత్నానికి ఎందుకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అదే సమయంలో నవ్య ఆత్మహత్యాయత్నం చేసిన విషయం యువకుడు నానికి కూడా తెలిసిపోయింది. దీంతో యువతి కుటుంబసభ్యులు తనను ఏమైనా చేస్తారేమోనన్న భయంతో అతడు కూడా సూసైడ్ ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకుంటున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.