సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (13:24 IST)

గర్ల్స్ కాలేజీలోకి వచ్చిన పోకిరి.. బుద్ధి చెప్పిన అమ్మాయిలు.. ఎలా?

గర్ల్స్ కాలేజీలోకి వచ్చి, అమ్మాయిలను ఏడిపించబోయిన ఓ పోకిరికి భలేగా బుద్ధి చెప్పారు అమ్మాయిలు. వివరాల్లోకి వెళితే.. యూపీ భాగ్‌పట్ జిల్లాలో ఉన్న బడౌట్ ఏరియాలో ధర్మాసింగ్ గర్ల్స్ ఇంటర్ కాలేజీలోకి ఓ పోకిరి వచ్చాడు. 
 
కపిల్ చౌహన్ అనే పేరు గల యువకుడు.. కాలేజ్ గోడ దూకి లోపలికి వచ్చాడు. కనిపించిన అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన ముగ్గురమ్మాలు.. కపిల్ చౌహన్‌కు ఎదురు తిరిగారు. బయటికి పోకుండా కాలేజీ గేు మూసి పిడి గుద్దుల వర్షం కురిపించారు. వారి దెబ్బలకు తాళలేక... పారిపోయేందుకు కాలేజ్ టెర్రస్ మీద నుంచి దూకేశాడు కపిల్. 
 
విద్యార్థులకు ఓ లేడీ అధ్యాపకురాలు కూడా సహకరించడంతో వారు ధైర్యంగా అతన్ని ఎదుర్కొన్నారు. కాలేజీ టెర్రర్స్ నుంచి దూకేయడంతో గాయాలపాలైన కపిల్ చౌహన్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.