శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (16:09 IST)

అర్జెంటు పని వుంది... అర్థరాత్రి అమ్మాయిని పిలిచీ...

ఇంట్లో పనికి కుదుర్చుకున్న 16 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే తిరస్కరించాడు. అబార్షన్ చేయించుకోమని, పరిహారంగా డబ్బులు కూడా ఇస్తామని చెప్పాడు. బాధితురాలు ఏమి చేయాలో తోచని స్థితిలో విషయం తల్లిదండ్రులతో చెప్పి ఘొల్లుమంది. ఇది ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఘాతుకం. 
 
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. గిలకలాదిండి గ్రామంలో ఓ 30 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో తల్లీకూతుళ్లు పనిచేస్తున్నారు. తల్లికి మరో ఇంట్లో పని కుదరటంతో, 16 ఏళ్ల కూతురిని మాత్రమే ఆ ఇంట్లో పనికి పెట్టి వెళ్లిపోయింది. కామాంధుడు బాలికపై కన్నేశాడు. ఒంటరిగా ఉన్న సమయంలో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఫలితంగా బాలిక గర్భందాల్చింది. 
 
అనారోగ్యంతో ఉండటంలో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అసలు విషయం బయటపడింది. ఈ విషయం గురించి బాలికను ప్రశ్నించగా దుర్మార్గుడు చేసిన అఘాయిత్యం గురించి చెప్పింది. కొద్ది రోజుల క్రితం రాత్రి అర్జెంటు పని ఉందని ఇంటికి రప్పించుకుని, దారుణానికి ఒడిగట్టాడని చెప్పింది. 
 
మూడునెలల గర్భవతి అని తెలిసి పెళ్లి చేసుకోమని అడిగితే తిరస్కరించాడని, అబార్షన్ చేసుకోమని చెప్పాడని, డబ్బులు కూడా ఇవ్వబోయాడని విలపించింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలికిపూడిలో ఉద్యోగం చేస్తున్న ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.