గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 1 జులై 2021 (16:31 IST)

మహిళతో స‌హ‌జీవ‌నం, కూతురిని ఇచ్చి పెళ్లి చేయాల‌ని ఒత్తిడి....

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ మ‌హిళ భ‌ర్త‌ను వ‌దిలేసి కూతురితో క‌లిసి ఒంట‌రిగా జీవ‌నం సాగిస్తుంది. ఆమెతో మంగ‌ళ‌గిరికి చెందిన గోలి సాంబ‌శివ‌రావు కొన్నేళ్లుగా వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. 
 
ఆ మ‌హిళ కూతురు ప్ర‌స్తుతం డిగ్రీ చ‌దువుతోంది. గ‌త కొన్ని రోజులుగా మ‌హిళ‌.. త‌న కూతురికి పెళ్లి చేయాలని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. సంబంధాల‌ను కూడా వెతికే ప‌నిలో ప‌డింది. అయితే మ‌హిళ కూతురిపై క‌న్నేసిన.. సాంబ‌శివ‌రావు ఆ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకోవ‌డం చేస్తున్నాడు. 
 
ఇక‌, త‌ల్లితో స‌హ‌జీవ‌నం చేస్తున్న సాంబ‌శివ‌రావును ఆ యువ‌తి తండ్రిగానే పిలుస్తోంది. అయితే సాంబ‌శివ‌రావు త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని అన‌డంతో.. ఆ యువ‌తి తీవ్ర ఆవేశానికి లోనైంది. 
అత‌ని చ‌ర్య‌ల‌కు ఎదురు తిరిగింది.
 
దీంతో సాంబ‌శివ‌రావు.. మ‌హిళ‌తో పాటుగా ఆమె కూతురుని వారం రోజులుగా ఇంట్లో బంధించి చిత్ర‌హింస‌లు పెట్టాడు. తను చెప్పిన‌ట్టుగా న‌డుచుకోవాల‌ని వారిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం యువ‌తిని బెల్ట్‌తో చిత‌క‌బాదాడు. 
 
ఇది చూసి యువ‌తి త‌ల్లి త‌ట్టుకోలేక‌పోయింది. చివ‌ర‌కు అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ల్లీకూతురు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.