బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (12:43 IST)

తిరుపతిలో కార్పొరేట్ స్థాయిలో మటన్ మార్కెట్ నిర్మాణం: ఎమ్మెల్యే భూమన

తిరుపతి నగరంలో కార్పొరేట్ స్థాయిలో మటన్ మార్కెట్ నిర్మిస్తున్నామని, మైనార్టీల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. స్థానిక పొగ తోట వీధిలోని పి.పి.చావడి లో నగరపాలక సంస్థ నిధులతో  నూతనంగా నిర్మించనున్న మటన్ మార్కెట్ శంఖుస్థాపన కు ముఖ్య అతిథులుగా శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష, ఎం.పి.గురుమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఐఏఎస్, ఉప మేయర్ ముద్ర నారాయణ పాల్గొన్నారు.

ముందుగా పూజలు నిర్వహించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మటన్ మార్కెట్ నిర్మిస్తున్న స్థలంలో  భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న మటన్ మార్కెట్ ను ఆధునాతన పద్ధతుల్లో నిర్మించనున్నామన్నారు.   50 లక్షలు నిధులతో అవసరమైతే మరో 20 లక్షలు కూడా అదనంగా వేసి కార్పొరేట్ స్థాయినీ తలదన్నేలా అన్ని అవసరాలకు ఉపయోగపడేలా నిర్మించనున్నారని అన్నారు.

కొనుగోలుదారులకు మటన్ మార్కెట్ లో ఎటువంటి అసౌకర్యాలు కు గురికాకుండా అత్యంత ఆధునిక పద్ధతులతో నిర్మాణం జరుగుతుందన్నారు. తిరుపతి ఏర్పడిన తొలినాళ్ళ నుండి ఈ మటన్ మార్కెట్ కు నగరప్రజలు  ఎక్కువ మంది వచ్చి మటన్ తీసుకెళ్ళే వారన్నారు. 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పొన్నాల చంద్ర, ఎస్ కే బాబు, నరేంద్ర, తాజుద్దీన్, కో ఆప్షన్ సభ్యులు ఇమామ్, ఖాదర్ బాషా, టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ తులసి యాదవ్ మటన్ మర్చంట్  అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ బాషా, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.