బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (18:21 IST)

జర్నలిస్టుల కార్లకు టోల్ ఫీజు రద్దు చేయాలి

రాష్ట్రంలో జాతీయ రహదారులపై వున్న టోల్ గేట్‌ల వద్ద జర్నలిస్టుల కార్లకు టోల్ టాక్స్ మినహాయింపు నివ్వవలసిందిగా భారతీయ జనతా పార్టీకు చెందిన రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరశింహరావుకు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మరియు రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు విజ్ఞప్తి చేసారు. 
 
మంగళవారం ఉదయం ఉయ్యూరులో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ఎంపిని కలిసి సాంబశివ నాయుడు విజ్ఞాపన పత్రం అందజేయగా సంభందిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని జీవీఎల్ నరసింహారావు హామీఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఎంపిను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసారు. యూనియన్ కోశాధికారి డి .కోటేశ్వరరావు సీనియర్ జర్నలిస్టులు యారా ప్రకాశ్, మరీదు రాజ, రాయపూడి రాము, ఫిరోజ్‌లు, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ చిన్నయ, భువనేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు.