శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 12 జూన్ 2020 (15:20 IST)

ఇది సీఎం జగన్ కుట్ర: అచ్చెంనాయుడి అరెస్టుపై చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అచ్చెంనాయుడు అరెస్టుపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దీనికి సహకరించిన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పన్నిన కుట్ర వలన ఈ సంఘటన చోటుచేసుకున్నదని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ పార్టీ శత్రుత్వంతో పగ తీర్చుకుంటుందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
 
రాష్ట్ర హోంశాఖామంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తూ... మందుల కొనుగోలు విషయమై ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినైనా చట్టం శిక్షిస్తుందని ఈ విషయంలో అదే జరిగిందని తెలియజేశారు. అవినీతికి పాల్పడితే అది కేంద్రప్రభుత్వమైనా, రాష్ట్రప్రభుత్వమైనా చట్టం తన పనిని చేస్తుందని వ్యాఖ్యానించారు.
 
అచ్చెంనాయుడ్ని తమ నివాసమైన శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని ఏసీబి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై తెదేపా నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.