సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 29 ఏప్రియల్ 2017 (13:33 IST)

టిటిడి ఛైర్మన్‌గా మురళీమోహన్.. దాదాపు ఖరారు...

చదలవాడ క్రిష్ణమూర్తి అధ్యక్షతన ఉన్న పాలకమండలి పదవీకాలం ముగియడంతో టిటిడి కొత్త ఛైర్మన్ ఎవరా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే అనుకున్నట్లుగానే సినీనటుడు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్‌ను ఆ పదవి వరిస్తున్నట్లు సమాచారం. ముందు నుంచే టిటిడి ఛైర్మన్ అవ్వాలన్

చదలవాడ క్రిష్ణమూర్తి అధ్యక్షతన ఉన్న పాలకమండలి పదవీకాలం ముగియడంతో టిటిడి కొత్త ఛైర్మన్ ఎవరా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే అనుకున్నట్లుగానే సినీనటుడు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్‌ను ఆ పదవి వరిస్తున్నట్లు సమాచారం. ముందు నుంచే టిటిడి ఛైర్మన్ అవ్వాలన్నది మురళీమోహన్‌కు చిరకాల ఆశగా వున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి గతంలోనే తీసుకెళ్ళాడు. అయితే అంతకుముందుగానే చదలవాడకు మాట ఇవ్వడంతో పదవిని ఆయనకే ఇచ్చేశారు. తరువాత అవకాశం కల్పిస్తామని చెప్పారు బాబు.
 
అయితే గుంటూరుకు చెందిన మరో నేత రాయపాటి సాంబశివరావు కూడా ఈ పదవి  కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే ఈమధ్య కాలంలో బాబుకు సాంబశివరావుకు మధ్య మనస్పర్థలు రావడంతో ఆయనకు ఇక పదవి లేనట్లే చెప్పుకుంటున్నారు. దీంతో మురళీమోహన్‌కే ఛైర్మన్ పదవి ఇవ్వాలన్న నిర్ణయాన్ని చంద్రబాబు తీసేసుకున్నారట. ఇక పాలకమండలి సభ్యులుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.