మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (11:33 IST)

టిడిపీకి రాజీనామా చేస్తున్నా, అసలు విషయం తర్వాత చెప్తా: దివ్యవాణి

divyavani
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నటి దివ్యవాణి బుధవారం రాత్రి ప్రకటించారు. తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుతో ఆమె సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆమె తను తెదేపాకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఐతే పూర్తి వివరాలు గురువారం నాడు వెల్లడిస్తానంటూ చెప్పుకొచ్చారు.

 
ఈమధ్య ఓ ఫేక్ పోస్టును చూసి తెలుగుదేశం పార్టీ పెద్దలు తనను ఘోరంగా అవమానించారనీ, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఐతే ఆ తర్వాత... అది ఫేక్ పోస్ట్ అని తెదేపా నాయకులు ఆమె దృష్టికి తీసుకురావడంతో ఆమె పెట్టిన సందేశాన్ని డిలీట్ చేసారు.

 
ఈ నేపధ్యంలో దానిపై వివరణ ఇచ్చుకునేందుకు బుధవారం రాత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. చివరికి మళ్లీ రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు.