సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:32 IST)

అగ్రిగోల్డ్‌ బాధితులకు జగన్ భరోసా!

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంగళవారం బాధితుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా బాధితుల ఖాతాల్లో నగదు చేయనున్నారు. 
 
అగ్రిగోల్డ్‌లో 10 వేల రూపాయల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన వారు 3,86,000 మందికి ఉన్నారు. వీరి కోసం 207 కోట్ల 61 లక్షల రూపాయలను చెల్లించనున్నారు. 
 
అలాగే రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన వారు మూడు లక్షల మందికిపైగా ఉన్నారు. వీరి కోసం రూ.459 కోట్ల 23 లక్షలు చెల్లించబోతున్నారు. మొత్తం 7 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం రూ.666.84 కోట్ల నగదును జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. 
 
కాగా, 2019 నవంబరులో 3.40 లక్షల మంది బాధితులకు రూ.238.73 కోట్ల నగదును సర్కార్ చెల్లించింది. దీంతో ఇప్పటివరకూ 10.40 లక్షల మంది బాధితులకు రూ.905.57 కోట్ల నగదు చెల్లింపులు జరిగాయి. హైకోర్టు ఆదేశాల మేరకు వాలంటీర్లు, సచివాలయాల ద్వారా బాధితుల్ని గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి చెల్లింపులు జరుపనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.