శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (12:17 IST)

కాకినాడ బీచ్ లో ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం

కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గుడా సంస్థకు వైస్ చైర్మన్ గా నియమించబడిన సంగతి తెలిసినదే.

గుడా ప్రణాళికలో భాగంగా ఈరోజు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు గూడా వైస్ చైర్మన్  గుడా ఇంజినీరింగ్ విభాగం వారితో  సమీక్ష అనంతరం  కాకినాడ నగరంలోని బీచ్ వద్ద ఏర్పాటు చేయుచున్న ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం నిర్మాణం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు రెండు నెలలు దాదాపు 7.9 కోట్ల నిర్మాణ వ్యయంతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నామని  తూర్పుగోదావరి జిల్లాకే ఈ మ్యూజియం తలమానికం కానున్నదని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ పర్యటనలో  సిబ్బంది కూడా పాల్గొన్నారు.