శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (07:50 IST)

రైతు పొలంలో బంగారు విగ్రహం- గుడిలో పూజలు

మొన్నటికి మొన్న ఓ రైతుకు పొలంలో వజ్రం లభించడంతో కోటీశ్వరుడు అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైతు పొలంలో బంగారం పడింది. పొలంలో బంగారు విగ్రహం లభ్యమైంది. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెంలో ఓ రైతు పొలంలో బంగారు విగ్రహం లభ్యమైంది. దీంతో ఆ రైతు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ బంగారు విగ్రహాన్ని గుడిలో ఉంచి పూజలు చేస్తున్నారు. 
 
విగ్రహం సుమారు 6 ఇంచులు ఉన్నట్లు తెలుస్తోంది. పొలంలో లభ్యమైన బంగారు విగ్రహం మల్లన్న దేవుడిదిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులకు కూడా సమాచారం అందింది. 
 
దీంతో అది తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పొలంలో ఇంకా గుప్త నిధులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలంలో మరిన్ని తవ్వకాలు చేయాలని భావిస్తున్నారు.