మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:34 IST)

తిరుప‌తిలో వాక్ మోడ్...అలైట్ మ‌ద్యం దుకాణాలు వ‌చ్చేస్తున్నాయ్!

రాష్ట్ర ప్ర‌భుత్వం న‌డ‌వాలంటే, మ‌ద్యం ఆదాయం ఎంతో అవ‌స‌రం. అందుకే, మ‌ద్యం అమ్మ‌కాల‌ను క్ర‌మేపీ పెంచుకుంటూ పోతోంది ఆబ్కారీ శాఖ‌. వై.ఎస్. జగ‌న్ తొలుత ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ద‌శ‌ల‌వారీ మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌ని చెప్పినా, ఇపుడు ప్ర‌బుత్వం న‌డ‌పాలంటే, మ‌ద్యం ఆదాయం త‌ప్ప‌ని స్థితికి చేరారు. ఇపుడు ఏపీలో కొత్త‌గా వాక్ మోడ్...అలైట్ మ‌ద్యం దుకాణాలు వ‌చ్చేస్తున్నాయ్!
 
ప్రభుత్వం మద్యం అమ్మకాలలో భాగంగా నూతన విధానం వాక్ మోడ్ ఎలైట్ మద్యం దుకాణాలు సూపర్ మార్కెట్ విధానంలో తీసుకొస్తున్నారు. దీని కోసం తిరుపతిలో కొన్ని ప్రాంతాలలో ఇలాంటి వాక్ మోడ్ అలైట్ మ‌ద్యం దుకాణాల ఏర్పాటుకు తగిన సౌకర్యాలున్న భ‌వ‌నాల ఎంపిక‌లో ఆబ్కారీ అధికారులున్నారు. తిరుప‌తిలో ఈ మ‌ద్యం సూప‌ర్ బ‌జార్ల కోసం భ‌వనాలను ఎక్సైజ్ అధికారులతో కలసి తిరుపతి ఆర్డీఓ వి .కనక నరసారెడ్డి ప‌రిశీలిస్తున్నారు. అంటే, త్వ‌ర‌లోనే తిరుప‌తిలో మ‌ద్యం సూప‌ర్ బ‌జార్లు ఇక ద‌ర్శ‌న‌మిస్తాయ‌న్న‌మాట‌.