శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (20:08 IST)

అన్ని ప్రాంతాలు అభివృద్ధి ... రాజధాని అంశంపై మంత్రి బొత్స

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూసుకొని రాజధాని అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది ఆలోచిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ అధికారులతో సీఎం జగన్ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స గతంలో రాజధాని అంశంలో బ్యాంకులు, ఆర్ధిక సంస్థలతో ఒప్పందాలు లేవని, ఇప్పుడు అన్ని పరిస్థితులను ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

రాజధాని అంటే ఐదు కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానిదో కాదన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని, ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష్యలేదన్నారు.

అమరావతిలో వరదల ముంపు ఉందని, ప్రభుత్వంలో రాజధానిఫై చర్చ జరుగుతుందని బాంబు పేల్చిన బొత్స సత్యనారాయణ మరోసారి అయన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించదన్న బొత్స రాజధాని విషయంలో వరదల గురించి మాత్రమే మాట్లాడానని, శివరాకృష్ణ రిపోర్ట్ పరిగణలోకి తీసుకోలేదని చెప్పానన్నారు.

చెన్నై, ముంబై ఎప్పుడో కట్టిన రాజధానులని వాటితో అమరావతికి పోలిక ఏమిటని, ఆ ప్రాంతాలలో వరద వస్తుందంటే అక్కడ రాజధానులు కట్టేవారా అని ప్రశ్నించిన మంత్రి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, తద్వారా 25 లక్షల కోట్ల సంపద సృష్టించబోతున్నామన్నారు.

ప్రస్తుతం రాజధాని పనులపై విచారణ జరుగుతుందని, పూర్తిస్థాయి విచారణ అనంతరం రాజధానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.