సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (18:17 IST)

విశాఖకు అమరావతి రైతులు బస్సు యాత్ర, ఎందుకో తెలుసా?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా అమరావతి రైతులు బస్సు యాత్ర చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారికి మద్దతు తెలిపేందుకు రాజధాని రైతులు వెలగపూడి నుంచి బయలుదేరారు. 
 
29 గ్రామాల నుంచి మూడు బస్సుల్లో.. విశాఖ వెళ్లి అక్కడ ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం తెలుపుతారు. రైతుల బస్సు యాత్రను గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, రాజధాని పరిరక్షణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ జెండా ఊపి బస్సు యాత్ర ప్రారంభించారు. 
 
"విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఈ యాత్ర చేపట్టాం" అని నేతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని తిప్పికొడతామన్నారు. ప్రజలను మోసం చేసేందుకు కుతంత్రాలకు తెర తీశారని విమర్శించారు.