శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (21:29 IST)

తెలంగాణ గ్రామాలు 24 గంటలూ వెలిగిపోతున్నాయి: మంత్రి హరీశ్‌తో కర్నాటక రైతులు

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్లే సందర్భంగా తెలంగాణ- కర్నాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా బీదర్ లోని ఓ గ్రామం వద్ద ఆగి గ్రామస్థులతో ముచ్చటించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
 
తాగు, సాగు నీరు, విద్యుత్, రైతులకు అందుతున్న సాయంపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు మీదుగా వెళుతుండగా కనిపించిన గ్రామస్థులతో సంభాషణ.
 
మంత్రి- అమ్మా బాగున్నారా... ఎలా ఉన్నారు. మీది ఏ గ్రామం.
మహిళలు- మాది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా‌ జాంబిగ గ్రామంలోని గామ తండా వాసులం.
 
మంత్రి- మీకు పెన్షన్స్ ఇస్తోందా మీ ప్రభుత్వం, ఎంత ఇస్తున్నారు.
మహిళలు- మా ప్రభుత్వం ఐదువందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు‌.
 
మంత్రి- తెలంగాణ రాష్ట్రంలోని మీ పక్కనే ఉన్న నారాయణఖేడ్‌లో పెన్షన్ ఎంత ఇస్తున్నారో తెలుసా.
మహిళలు- మా వాళ్లు అక్కడ ఉన్నారు సార్. రెండు వేల రూపాయలు ఇస్తున్నారు‌.
 
మంత్రి- విద్యుత్ ఎంతసేపు ఇస్తున్నారు.
రైతు- ఐదు గంటలు‌ కూడా కరెంటు రావడం‌లేదు ప్రతీ పది నిముషాలకు ఒక సారి కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది. నా ఐదేకరాల పంటకు నీరు పారాలంటే పది రోజులు పడుతుంది‌‌ సార్.
 
మంత్రి- పక్కనే నారాయణ ఖేడ్‌లో కరెంటు ఎలా ఉంది.
గ్రామస్థులు- సార్ పక్కనే తెలంగాణ గ్రామాలు మాకు కనిపిస్తనే ఉంటుంది. 24 గంటలు కరెంట్ వస్తోంది. మేం చూస్తూనే ఉన్నాం. మా బాధలు‌ తెలుసుకునే వారే లేరు.
 
మంత్రి- అమ్మా ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ సందర్భంగా ప్రభుత్వ‌ సాయం ఏమైనా అందుతుందా.
మహిళలు- మాకేమీ ఇవ్వడం‌లేదు.
 
మంత్రి- మేం డెలివరీ ‌సందర్భంగా కేసీఆర్ ‌కిట్ అందజేస్తున్నాం.
మహిళలు- మీదగ్గర అన్నీ బాగా చేస్తున్నరు సార్.
 
మంత్రి- పెళ్లికి ఏమైనా సాయం చేస్తున్నరా..
మహిళలు- లేదు సార్ ఏదీ సాయం అందడం లేదు.
 
మంత్రి- నారాయణ ఖేడ్‌లో పెళ్లికి సాయం అందుతుందా..
మహిళలు- మాకు తెలుసు‌సార్, మా వాళ్లు ఉన్నారు. పెళ్లికి లక్ష రూపాయల సాయం అందుతోంది.
 
మంత్రి- మంచినీటి సౌకర్యం అందుతుందా..? ఇంటింటికి తాగు నీరు ఇస్తున్నారా?
మహిళలు - కిలో మీటర్ దూరం నుండి ఇక్కడకు వచ్చి నీళ్లు పట్టుకుంటాం సర్. కరెంట్ వస్తే బిందెలతో నీళ్లు తెచ్చుకుంటాం.
 
మంత్రి- వ్యవసాయానికి మీ ప్రభుత్వం సాయం చేస్తుందా?
రైతు- మాకు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు‌.
 
మంత్రి- మేం‌ము ఎకరానికి పది‌వేల రూపాయలు చొప్పున, ఎన్ని ఎకరాలుంటే అన్ని పది వేల రూపాయలు ఇస్తున్నాం.