శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (07:01 IST)

బ్యాట్ పడితే బంతి బౌండరీ నే.. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన హరీష్ రావు

నిన్నటి దాకా ఎన్నికల హడావిడిలో ఉన్న మంత్రి హరీష్ రావు ఆటవిడుపు గా సిద్దిపేట లో ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనడం కాకా , సిద్ధిపేట క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్ గా వ్యహరించారు.

అయితే తన టీమ్ 3వికెట్లు కోల్పోయిన సమయంలో మంత్రి హరీష్ రావు బ్యాటింగ్ తో గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు.. గ్రౌండ్ లో ఎంటరీ అవుతోనే బంతిని బౌండరీ ల వైపు పరుగులు పెట్టించారు.

బ్యాంటింగ్ తన దైన శైలి లో సునాయాసంగా పరుగులు తీస్తూ వరుసగా రెండు ఫోర్లను కొట్టాడు..రన్స్ చేస్తూ.. 12 బాల్స్ లో 18 పరుగులు చేసి ఔటయ్యారు..
 
హరీష్ రావు అంటే పోలిటికల్ నే తన ముద్ర అనుకుంటాం.. ఏదైనా సరే తనదైన ముద్ర ఉండాల్సిందే , గెలుపు కొరకు పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేస్తారు.

అదే తరహాలో తన కెప్టెన్సీ లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ను అదే పంథాలో వ్యవహరించారు.. బ్యాటింగ్ చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను కేరింతలు పుట్టించేల పరుగుల వరద కురిపించారు.

కొద్దీ బాల్స్..కొద్దీ నిముషాలు అయినప్పటికీ అంతే స్థాయిలో పరుగులు తీయడం లో హరీశ్ రావు మరో సారి తన క్రీడా స్పూర్తిని చాటుకున్నారు.