బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (19:44 IST)

మీ అబ్బాయి నారా లోకేష్‌లో ఏదో తేడా వుంది: నారా భువనేశ్వరికి అంబటి మనవి

వైసిపి నాయకుడు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి తీవ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబులపై విమర్శనాస్త్రాలు సంధించారు. కుప్పంలో పంచాయతీ ఓటమి దెబ్బకి చంద్రబాబు వీధి వీధి పట్టుకుని తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేసారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయంటూ జోస్యం చెప్పారు.
 
నారా లోకేష్ పార్టీలోకి ప్రవేశించాక సైకిల్ తునాతునకలైపోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో పడి తన కుమారుడిని పట్టించుకోవడం లేదన్నారు. నారా లోకేష్ లో ఏదో తేడా వుందనీ, దాన్ని సరి చేయించాల్సిన బాధ్యత ఆయన తల్లి భువనేశ్వరిపై వుందని అన్నారు.
 
తండ్రి పట్టించుకోకపోయినా తల్లిగా ఆమెకి తను మనవి చేసుకుంటున్నాననీ, నారా లోకేష్ ను మంచి ఆసుపత్రికి చూపించాలన్నారు. రాజకీయ నాయకుడుగా లోకేష్ పనికిరాడనీ, కనీసం మంచి పౌరుడిగానైనా తీర్చిదిద్దేందుకు భువనేశ్వరి గారు ప్రయత్నించాలంటూ అంబటి రాంబాబు సెటైర్లు వేసారు.