శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (09:24 IST)

రతిలో సహకరించలేదనీ చావమన్న డాక్టర్ భర్త.. చనిపోయిన భార్య.. ఎక్కడ?

ఇటీవల అమరావతి వద్ద ఓ నవవధువు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలిసింది. మూడు నెలల క్రితం వివామైన ఈ నవవధువు.. పడక గదిలో సరిగా సహకరించడం లేదన్న కోపంతో భర్త చావమన్నాడు.

ఇటీవల అమరావతి వద్ద ఓ నవవధువు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలిసింది. మూడు నెలల క్రితం వివామైన ఈ నవవధువు.. పడక గదిలో సరిగా సహకరించడం లేదన్న కోపంతో భర్త చావమన్నాడు. అంతే... ఇకేమాత్రం ఆలోచన చేయకుండా ఆ నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం ఆమె చనిపోయే ముందు తన తల్లిదండ్రులకు పంపిన ఎస్ఎస్ఎంలో వెల్లడైంది. అలాగే, భర్త వేధింపుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె ఓ కాగితంపై రాసిపెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువుకు చెందిన అమరనాథ్‌ అనే వ్యక్తి దంత వైద్యశాల నడుపుతున్నాడు. మే నెలలో హైదరాబాద్‌కు చెందిన సుజల(27)తో అతనికి వివాహమైంది. వేరుకాపురం పెట్టేందుకు అమరావతిలోని విజయవాడ రోడ్డు సమీపంలో నెలరోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకున్నారు. 
 
ఆషాఢం రావడంతో సుజల పుట్టింటికి వెళ్లి మూడు రోజుల క్రితం అమరావతి చేరుకుంది. శనివారం ఉదయం యథావిధిగా పనులు చేసుకుని మధ్యాహ్నం దంపతులిద్దరూ కలసి భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం వైద్యశాలకు వెళ్లిన అమరనాథ్‌ తిరిగి ఇంటికి వచ్చేసరికి వంట గదిలో భార్య చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
అయితే, సుజల ఆత్మహత్య చేసుకునేముందు తన తల్లిదండ్రులకు పెట్టిన సెల్‌ఫోన్‌ మెసేజ్‌ ఓ పెట్టింది. అలాగే, తాను ఆత్మహత్య చేసుకుంటున్నాననీ, అందుకు తన భర్త అమరనాథ్‌ కారణమనీ కాగితంపై రాసి బైబిల్‌లో ఉంచినట్లు మెసేజ్‌ పెట్టింది. దాని ఆధారంగా సీఐ మురళీకృష్ణ విచారణ చేపట్టగా భర్త వేధించడం, చావమని ప్రోత్సహించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. 
 
సుజల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భర్త అమరనాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని సోమవారం కోర్టులో హాజరు పర్చనున్నట్లు సీఐ తెలిపారు. సుజల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.