గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 10 నవంబరు 2021 (12:50 IST)

వాస్తవాన్ని నిక్కచ్ఛిగా వెల్లడించిన విద్యార్థిని జయలక్ష్మి

అనంత‌పురంలోని ఎస్ ఎస్ బి ఎన్ కాలేజీ విద్యార్థిని జ‌య‌ల‌క్ష్మి జ‌రిగిన వాస్త‌వాన్ని నిక‌చ్చిగా వెల్ల‌డించి స్ఫూర్తి దాయ‌కంగా నిలిచింద‌ని అనంత పోలీసులు కొనియ‌డుతున్నారు. పలువురు పోలీసు అధికారులు అమెకు సెల్యూట్ చెపుతున్నారు. నిజాన్ని నిర్భయంగా, పారదర్శకంగా జయలక్ష్మి వెల్లడించింద‌ని పేర్కొంటున్నారు. జయలక్ష్మికి పలువురు పోలీసు అధికారులు, ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు.


అనంత‌పురంలోని ఎస్.ఎస్.బి.ఎన్. కళాశాలలో మొన్న జరిగిన సంఘటనలో జయలక్ష్మి గాయపడిన విషయం తెలిసిందే. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం సంఘటనను వక్రీకరించార‌ని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు లాఠీ చార్జి చేయడం వల్ల ఆ అమ్మాయి గాయపడిందని తప్పుడు ప్రచారం, ప్రకటనలు చేశార‌ని, ఇలాంటి పరిస్థితులలో జయలక్ష్మి ధైర్యంగా స్పందించింద‌ని కొనియాడుతున్నారు. విద్యార్థులు రువ్విన రాయి తనపై పడటంతో గాయపడినట్లు జ‌య‌ల‌క్ష్మి ఒక సెల్ఫీ వీడియోలో వెల్లడించింది.


జయలక్ష్మి వాస్తవాల‌ను స్వయంగా అంద‌రికీ తెలియజేయడం ఎంతో స్ఫూర్తిదాయ‌కం అని పోలీసులు ప్రశంసిస్తున్నారు. ఆమె వీడియో ద్వారా వాస్త‌వాలు ఏమిట‌నేది ప్ర‌జ‌లకు అవ‌గ‌తం అయిందంటున్నారు.