మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మే 2023 (09:15 IST)

పవన్ "హోల్‌సేల్ ప్యాకేజీ స్టార్" బాబుకు పెంపుడు కొడుకు.. జగన్ ఫైర్

ys jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి  జనసేనాని పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  పవన్ కళ్యాణ్‌ను "హోల్‌సేల్ ప్యాకేజీ స్టార్" అని జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 
 
2019లో తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన పవన్ కల్యాణ్ తన షూటింగ్ షెడ్యూల్‌ల మధ్య రాజకీయ సమావేశాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు పవన్ పెంపుడు కొడుకు అంటూ విమర్శించారు. 
 
బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 175 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేసే దమ్ము టీడీపీ, జనసేనలకు లేదని ఫైర్ అయ్యారు. 
 
అయితే రాజకీయ మనుగడ కోసం పొత్తులు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండో స్థానం కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు.