1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (10:32 IST)

రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తీవ్ర గాయాలు

kanduala narayanayan reddy
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మార్కాపురం నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం సమీపంలో గురిజెల్లి మూలమలుపు వద్ద  కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నారాయణ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరానికి తరలించారు. 
 
ప్రస్తుతం ఈయన మార్కాపురం తెదేపా ఇన్‌ఛార్జ్‌‌గా కొనసాగుతున్నారు. మార్కాపురం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద ఆయన కారు బోల్తా పడింది. తీవ్రగాయాలైన నారాయణరెడ్డిని యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. ప్రమాదంలో కారు డ్రైవర్‌ స్వల్పంగా గాయపడ్డారు.