సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 మే 2023 (10:53 IST)

నదిలో పడిపోయిన ప్రైవేటు బస్సు - 15 మంది మృతి

bus accident
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఖర్గోన్‌ నుంచి ఇండోర్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి 50 అడుగుల కిందున్న నదిలో పడింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు వెళ్లి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.