గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (22:37 IST)

అనిరుధ్, విజయ్ తర్వాత క్లాస్‌మేట్‌తో ప్రేమలో కీర్తి సురేష్..?! (video)

menaka-keerthy
జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ ఇటీవల ఎఫైర్‌తో వార్తల్లో నిలిచింది. ముగ్గురితో ఆమె అఫైర్లు కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కోలీవుడ్ స్టార్ విజయ్‌లతో ఆమెకు ఎఫైర్లు ఉన్నాయని కోలీవుడ్ మీడియాలో కోడైకూసింది. 
 
ప్రస్తుతం కీర్తి సురేష్ ఆమె క్లాస్‌మేట్‌తో ప్రేమలో ఉందని మరో వాదన తెరపైకి వచ్చింది. కేరళకు చెందిన కీర్తి సురేశ్ రిసార్ట్ యజమాని క్లాస్‌మేట్‌తో ప్రేమలో వున్నట్లు టాక్ వస్తోంది. వీరి రిలేషన్ గురించి కుటుంబ సభ్యులకు కూడా తెలిసిందని.. త్వరలోనే పెళ్లి ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్తలపై కీర్తి సురేష్ మౌనం వహించింది. ఆమె ఏ విధంగానూ వివరించే ప్రయత్నం చేయలేదు. అయితే కీర్తి సురేశ్ తల్లి మేనకా సురేశ్ స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేనకను కీర్తి సురేష్ ఎఫైర్ గురించి వస్తున్న రూమర్స్ గురించి అడిగారు. 
 
ఇంకా ఆమె మాట్లాడుతూ “నా కూతురు కీర్తి ఎవరినీ ప్రేమించదు. అలాంటిది ఏదైనా ఉంటే ఆమె మాకు చెబుతుంది. ఆ తర్వాత మీడియాకు బహిరంగంగా చెబుతాం. " కీర్తి గురించి పుకార్లు స్ప్రెడ్ అవుతున్నాయంటే, ఆమె తన కెరీర్‌లో ఎదుగుతోంది అని మేనక చెప్పుకొచ్చారు. 
 
మేనక ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఆమె తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. వందలాది మలయాళం, తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించింది. మరోవైపు, కీర్తి సురేష్, నాని నటించిన దసరా మార్చి30న థియేటర్లలోకి వచ్చింది.