ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మే 2023 (21:06 IST)

సీఎం దృష్టిలో పడేందుకు ఇలా చేశారా? ఏడాది బిడ్డను స్టేజ్‌పైకి విసిరేశాడు..

సీఎం దృష్టిలో పడేందుకు ఓ తండ్రి చేసిన చర్య చర్చకు దారితీసింది. ఏడాది బిడ్డను వేదికపైకి విసిరేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేష్ పటేల్, నేహా భార్యాభర్తలు. ముకేశ్ కూలీ. ఈ జంటకు ఏడాది వయస్సున్న కుమారుడు వున్నాడు. 
 
ఈ చిన్నారికి మూడు నెలల వయస్సున్నప్పుడు గుండెలో రంధ్రం వుందని వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం నాలుగు లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంకా నాలుగు లక్షలు కావాలి. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో వారికి అర్థం కాలేదు. దీంతో తమ గోడు వినిపించుకోలేదనే.. కోపంతో సాగర్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
కానీ సీఎం దగ్గరకు వెళ్లడం సాధ్యం కాదు. దీంతో వేదికపై సీఎం ప్రసంగిస్తోన్న సమయంలో ఒక్కసారిగా బిడ్డను విసిరేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ పిల్లాడిని కాపాడి.. తల్లికి అప్పగించారు. దీంతో చిన్నారి సమస్య తెలుసుకున్న సీఎం.. వైద్య సాయం కోసం అందిస్తామని హామీ ఇచ్చారు.