శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (15:15 IST)

తల్లిని చంపేందుకు ఇంటికి నిప్పు పెట్టిన కుమారుడు... తర్వాత ఏం జరిగింది?

house tourch
కన్నతల్లిని చంపేందుకు ఓ కిరాతక కుమారుడు సొంత ఇంటికే నిప్పుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత తన తల్లి బయట నుంచి రావడాన్ని చూసి విస్తుపోయి, అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీర్కూరులో జరిగింది. 
 
బీర్కూరుకు చెందిన గువ్వల చంద్రవ్వ, నారాయణ దంపతులకు ఒకే కుమారుడు ఉన్నాడు. ఈయన పేరు అశోక్. గతంలోనే నారాయణ చనిపోయాడు. అశోక్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. తల్లి చంద్రవ్వ మాత్రం బీర్కూరులో ఉంటుంది. అశోక్ నిత్యం డబ్బులు కోసం చంద్రవ్వను వేధించేసాగాడు. 
 
తల్లిపేరిట ఉన్న ఆస్తిని తన పేరుమీద రాయాలని గొడవ చేసేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం బీర్కూరుకు అశోక్ చేరుకుని, తల్లి ఇంటి ఉందని భావించి పైకప్పుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ సమయంలో తల్లి చంద్రవ్వ బయట నుంచి రావడాన్ని చూసిన అశోక్ అక్కడ నుంచి పారిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.