ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

మరోమారు బోల్డ్ క్యారెక్టర్‌లో అనసూయ

anasuya
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోమారు వెండితెరపై బోల్డ్ క్యారెక్టర్‌‍లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న విషయం తెల్సిందే. తాజాగా సముద్రఖని హీరోగా నటించిన "విమానం" చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శివప్రసాద్ దర్శకత్వం వహించారు. 
 
ఈ మూవీలో అనసూయ గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఇందులో ఆమె పాత్ర పేరు సుమతి. అనసూయ పాత్రకు సంబంధించిన ఫోటో లుక్‌ను చిత్రం బృందం రిలీజ్ చేసింది. ఇందులో ఆమె చాలా సెక్సీగా కనిపిస్తున్ారు. ఆమె పాత్ర చాలా బోల్డ్‌గా ఉండనుందనే విషయన ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతుంది. 
 
తండ్రీ కొడుకుల అనుబంధం ప్రధానంగా చేసుకుని సాగే కథ. తండ్రిగా వీరయ్య పాత్రలో సముద్రఖని నటిస్తుంటే, ఆయన కుమారుడు పాత్రలో ధృవన్ పోషిస్తున్నారు. రాజేంద్రన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. చరణ్ అర్జున్ సంగీతం సమకూర్చగా, జూన్ 9వ తేదీన తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.