శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మే 2023 (15:00 IST)

రెండో భార్య సంసారానికి రాలేదు.. తొలి భార్య కొడుకును చంపేశాడు..

crime scene
తొలి భార్యతో కలిగిన సంతానం విషయంలో రెండో భార్యతో గొడవలు జరగడంతో కన్నకుమారుడిని చంపేశాడు ఓ కిరాతకుడు. రెండో భార్య కాపురానికి రావట్లేదని ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఇండోర్ లోని తేజాజీ నగర్ ఏరియాలో ఉంటున్న శశిపాల్ ముండే (26) మొదటి భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. మొదటి భార్యకు, శశిపాల్ ముండేకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. భార్య చనిపోవడంతో శశిపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండో భార్యతో శశిపాల్‌ కుదురుగా సంసారం చేయలేదు. 
 
తరచూ గొడవలు తప్పలేదు. ఈ క్రమంలో పిల్లాడిని తాను చూసుకోలేనని చెప్పి శశిపాల్ రెండో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక మొదటి భార్య కుమారుడు వున్నంత కాలం రెండో భార్య సంసారానికి రాదని తేల్చి చెప్పేయడంతో.. విసిగిపోయిన శశిపాల్ కన్న కొడుకును కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న శశిపాల్‌ను అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.