ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

రెండో భార్యతో గొడవ - కన్న కొడుకుని చంపేసిన తండ్రి

murder
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌‍లో దారుణం జరిగింది. రెండో భార్యతో గొడవపడిన తండ్రి.. కన్నబిడ్డను చంపేశాడు. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, కొడుకు విషయంలో రెండో భార్యతో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తండ్రి.. తన కుమారుడుని చంపేశాడు. రెండో భార్యతో తన సంసారం సాఫీగా సాగిపోయేందుకు వీలుగా ఏడేళ్ల పిల్లాడని చంపేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోర్‌లోని తేజాజీ నగర్ ఏరియాలో ఉంటున్న శశిపాల్ ముండే (26) అనే వ్యక్తి మొదటి భార్య చనిపోయింది. మొదటి భార్య - శశిపాల్‌కు మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు. భార్య చనిపోవడంతో శశిపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, కొడుకును చూసుకునే విషయంలో ఆయన రెండో భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో పిల్లాడిని తాను చూసుకోలేనని చెప్పి శశిపాల్ రెండో భార్య తన పుట్టింటింకి వెళ్లిపోయింది. శశిపాల్ మొదటి భార్య కొడుకు ఉన్నంతవరకు తాను కాపురానికిరానంటూ తేల్చి చెప్పింది. దీంతో విసిగిపోయిన శశిపాల్.. కన్న కుమారుడిని కత్తితో పొడిచి చంపేశాడు. చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శశిపాల్ కోసం గాలిస్తున్నారు.