శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 మే 2023 (13:57 IST)

కన్నబిడ్డను హత్య చేసిన తల్లి.. సినిమా బాణీలో ప్రతీకారం తీర్చుకున్న తండ్రి.. ఎక్కడ?

murder
తన అక్రమ సంబంధం బయటపడుతుందన్న భయంతో కన్నబిడ్డను తన ప్రియుడితో కలిసి ఓ కసాయి తల్లి హత్య చేసింది. ఈ విషయం తెలుసుకున్న మృతుని తండ్రి.. చాలా తెలివిగా, జైలులో ఉన్న తన భార్య ప్రియుడిని బెయిలుపై బయటకు రప్పించి, సినిమా స్టైల్‌లో హత్య చేశాడు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖైరీ జిల్లాలోని మితౌలీ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత 2020లో ఓ వివాదం కేసులో కాశీ కశ్యప్ (50) అనే వ్యక్తి సహ నిందితుడు కావడంతో జైలుకు వెళ్లారు. తన భార్య, మైనర్ అయిన తన కుమారుడిని అత్తగారింటికి పంపించాడు. ఈ క్రమలో 2021లో కాశీ కుమారుడు జితేంద్ర కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత అతని మృతదేహం ఓ నది ఒడ్డున లభించింది. అతని మృతిలో మిస్టరీని కొంతకాలం వరకు పోలీసులు గుర్తించలేకపోయారు. 
 
ఈ క్రమంలో కొన్ని నెలల తర్వాత కాశీ భార్య, శత్రుధన్ లాలా (47)లకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఓ రోజున వీరిద్దరూ సన్నిహిత స్థితిలో ఉండటాన్ని కుమారుడు జితేంద్ర చూడటంతో తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో తన ప్రియుడితో కలిసి కాశీ భార్య హత్య చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
కొంతకాలానికి లాలాకు, కాశీ భార్యకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో కాశీ భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ తర్వాత వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. తామిద్దరం కలిసి జితేంద్రను హత్య చేసినట్టు చెప్పడంతో పోలీసులకు షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో లాలా జైలుశిక్షను ముగించుకుని జైలు నుంచి విడుదలయ్యాడు. 
 
అతనికి తన కుమారుడు ఎవరు చంపారో తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని పక్కా ప్లాన్ వేశాడు. ఇందులోభాగంగా, జైలులో ఉన్న లాలాను బెయిలుపై బయటకు రప్పించాడు. ఈ నెల 5వ తేదీన లాలా తలపై కాశీ కశ్యప్ మూడుసార్లు కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందాడు. ఈ కేసులో కాశీని పోలీసులు మళ్లీ అరెస్టు చేసి జైలుకు పంపించారు.