గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 మే 2023 (08:52 IST)

కాకినాడ రాఘవమ్మ చెరువు నీటిలో విషం... చనిపోయిన వేలాది చేపలు

fish pond
కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం శివారులోని రాఘవమ్మ చెరువులో గుర్తు తెలియని దుండగులు విషం కలిపారు. దీంతో చెరువులోని వేలాది చేపలు చనిపోతున్నాయి. చనిపోయిన చేపలు నీటిపై తేలాడుతూ ఒడ్డుకు కొట్టుకునివస్తున్నాయి. దీంతో ఆక్వా రైతులకు లక్షలాది రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. 
 
ఈ చెరువును కొందరు ఆక్వా రైతులు లీజుకు తీసుకుని చేపల పెంపకాన్ని చేపట్టారు. ఇపుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలపడంతో చెరువులోని చేపలు చనిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన రైతులు బోరున విలపిస్తున్నారు. చెరువు నీటిలో విషం కలపడం వల్లే బాగా పెరిగిన చేపలన్నీ చనిపోయాయని రైతులు చెబుతున్నారు. 
 
మరోవైపు, ఈ ఘటనపై చెరువు లీజుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో విషం కలిపిన వారిని గుర్తించిం తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కాగా, చెరువులో విషం కలిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.