గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2023 (15:28 IST)

మందు బాబులకు శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్ సర్కారు

liquor
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను తెరిచివుంచే సమయాన్ని పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబరు 31వ తేదీతో పాటు జనవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులను అర్థరాత్రి వరకు తెరిచివుంచేలా ఆదేశించారు. ఈ మేరకు ఏపీ అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ప్రతి రోజూ మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు తెరిచివుంచుతారు. 
 
కానీ, కొత్త సంవత్సరంరోజును పురస్కరించుకుని అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచివుంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నటించే అన్ని ఈవెంట్స్‌లో ఈ రెండు రోజుల పాటు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఇది కేవలం ఈవెంట్స్ నిర్వహించే ప్రదేశం లోపల మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇది కేవలం ఈవెంట్స్ నిర్వహించే ప్రదేశం లోపల మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.