1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2023 (10:56 IST)

ఇద్దరు బిడ్డలను నీటి బకెట్‌లో చంపేసిన తల్లి.. ఎక్కడ.. ఎందుకు?

mother
ఓ కషాయి తల్లి తన ఇద్దరు పిల్లలను నీటి బకెట్‌లో ముంచి చంపేసింది. ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని హాల్వీలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హాల్వి గ్రామానికి చెందిన రామకృష్ణ, శారద దంపతులకు ఇద్దరు కుమారులు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న సమయంలో శారద తన ఇద్దరు కుమారులు వెంకటేశ్ (3), భరత్ (6 నెలలు)లను నీటి బకెట్‌లో ముంచింది. చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భర్తతో కలిసి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
చిన్నారుల మృతదేహాల్ని శవ పరీక్ష నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుమారులను చంపినట్టు తెలిస్తే ఇంట్లోవారు తనను చంపేస్తారనే భయంతో శారద కూడా విషం సేవించింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను చంపడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసినట్టు  ఎస్ఐ నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు.