అలాంటి వాళ్లకి పిల్లలెందుకు.. బిడ్డతో పాటు ఆటో నడుపుతున్న మహిళ..!
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తన పిల్లలను డేకేర్ లలో వదిలిపెట్టడం.. పనిమనిషుల చెంత వదిలిపెట్టడం చూస్తుంటాం. అయితే ఓ ఆటో నడిపే మహిళ తన బిడ్డను తానే చూసుకుంటూ ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తోంది. సింగిల్ పారెంట్ కావడంతో బిడ్డను అంతా తానై చేసుకుంటూ పోతోంది.
బెల్టుతో బిడ్డను ముందు కట్టుకుని బండిని నడుపుతోంది. తమిళనాడుకు చెందిన ఓ మహిళా ఆటో డ్రైవర్ స్టోరీ ఇది. ఎనిమిది సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నానని.. రెండేళ్ల పాటు సింగిల్ పారెంట్ అని తెలిపింది.
తన బిడ్డ తనతో సురక్షితంగా వుందనే సంతోషంతో ఆటో జర్నీ చేస్తున్నానని ఆ మహిళా డ్రైవర్ తెలిపింది. చెన్నైలోని తిరువాన్మియూర్- వేలచ్చేరి ఆటో సంఘంలో ఉపకార్యదర్శిగా వున్నానని.. అలాగే సింగిల్ పారెంట్‌గా తన బిడ్డను తానోనే వుంచుకుని బండిని నడుపుతున్నానని చెప్పుకొచ్చింది.
మహిళలు ఎంలాంటి జంకూ లేకుండా.. నిబ్బరంగా అన్నీ రంగాల్లో రాణించాలని ఆటో డ్రైవర్ ప్రియ తెలిపింది. ఇంకా పిల్లల్ని పెంచలేని వారిని పుట్టించుకోవడమే పాపం అంటూ తెలిపింది. పిల్లల్ని తల్లిదండ్రుల వద్దే పెరగాలన్నదే తన అభిప్రాయం అని వెల్లడించింది.