శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (21:50 IST)

20 ఏళ్ల పాటు భార్యతో మాట్లాడని భర్త.. ఎందుకో తెలుసా?

Japanese Man
Japanese Man
20 ఏళ్ల క్రితం తన భార్యపై భర్తకు కోపం వచ్చింది. అప్పటి నుంచి భర్త భార్యతో మాట్లాడట్లేదు. భార్యతో మాట్లాడకపోయినా.. తన పిల్లలతో మాట్లాడతాడు. జపాన్ లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. దక్షిణ జపాన్‌కు చెందిన ఒటౌ కటాయామా తన భార్య యుమీ ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. 
 
అయితే ఒటౌకి 20 ఏళ్ల క్రితం తన భార్య యుమీపై కోపం వచ్చింది. అప్పటి నుంచి అంటే గత 20 సంవత్సరాలుగా తన భార్యతో మాట్లాడటం లేదు. తన  భార్య యుమీ పిల్లలపై చూపుతున్న శ్రద్ధ చూసి తనకు అసూయ కలిగిందని ఒటౌ చెప్పాడు. ఈ రీజన్ విని అందరూ నవ్వుకున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే తనకంటే తన పిల్లలని ప్రేమిస్తుందని అందుకే తన భార్యతో మాట్లాడటం మానేసినట్లు చెప్పాడు. ఓటౌ 18 ఏళ్ల కుమారుడు యోషికి తన తల్లిదండ్రులు మాట్లాడుకోవాలని చేసేందుకు ఓ టీవీ షో సహాయం తీసుకున్నాడు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో ఓటౌ తన కోపానికి ఇక గుడ్ బై చెప్పాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.