శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:51 IST)

అమృత్ పథకం నిర్వహణలో ఏపీ ఫస్ట్... ఇదిగోండి సర్టిఫికేట్: తెలంగాణ వెనుకబడిపోయిందే?

అమరావతి: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన అమృత్ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. నగరాలలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు

అమరావతి: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన అమృత్ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. నగరాలలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు 2015 జూన్ 25న కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ పథకం అమలు తీరు ఆధారంగా కేంద్రం ర్యాంకులు ఇస్తోంది. 
 
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మొదటి మూడు సంవత్సరాలలో ఈ పథకం అమలును సమీక్షించి ఇచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏపీ 65.24 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించింది. 59.17 శాతం మార్కులతో ఒడిస్సా రెండవ స్థానంలో, 54.32 శాతం మార్కులతో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో, 52.39 శాతం మార్కులతో తెలంగాణ 4వ స్థానంలో నిలిచాయి. 
 
సోమవారం ఢిల్లీలో జరిగిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ జాతీయ సమావేశంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ ఏపీ పట్టణ పరిపాలన శాఖ, అమృత్ మిషన్ ఏపీ డైరెక్టర్ కె.కన్నబాబుకు అవార్డుని అందజేశారు.