ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకుని కొందరు డిస్ట్రిబ్యూటర్లు నాసిరకం మందులను యధేచ్చగా సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ ప్రాంతాలు కూడా నకిలీ మందులకు అడ్డాగా మారుతోందని ఔషధ తనిఖీ నియంత్రణ శాఖ అధికారుల తాజా తనిఖీల్లో గుర్తించారు.
ఈ నకిలీ మందుల్లో మధుమేహం, అధిక రక్తపోటు, యాంటీ బయోటిక్‌లు, కడుపు ఉబ్బరం తగ్గించే, ఎముకల బలానికి వాడే మందులు ఉన్నాయి. సిప్లా, అరిస్టో, ఆల్కెమ్, సన్‌ఫార్మా వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన మందులను పోలిన నకిలీలను వీటిలో గుర్తించారు. మరికొన్ని కంపెనీలను పోలిన నకిలీ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో చెలామణి అవుతున్న నకిలీ మందుల వివరాలను పరిశీలిస్తే,
* టాక్సిమ్ ఓ-200 ట్యాబ్లెట్లు(సెఫిక్జిమ్).
* ప్యాన్ 40 ట్యాబ్లెట్లు(ప్యాంటాప్రెజోల్ గ్యాస్ట్రిక్ రెసిస్టెన్స్).
* కుపాన్-డీ ట్యాబ్లెట్లు(పెంటాప్రజోల్, డోమిపెరిడిన్).
* మాంటెయిర్ -ఎల్‌సీ ట్యాబ్లెట్లు(మాంటెలుకాస్ట్, వివోసిట్రిజిన్).
* అజిప్రైమ్ 250(అజిత్రోమైసిన్).
* టెమి-40 ట్యాబ్లెట్లు(టెల్‌మిసార్టిన్).
* గ్లిమికట్ ఎం ట్యాబ్లెట్లు(గ్లిమిప్రైడ్, మెట్‌ఫార్మిన్).
* ప్యాంటాప్-40 ట్యాబ్లెట్లు(పెంటాప్రజోల్ గ్యాస్ట్రో రెసిస్టెన్స్).
* క్లావెమ్ 625 ట్యాబ్లెట్లు(ఆమాక్సిసిలిన్, పోటాషియం క్లావెలనెట్).
* డైక్లోఫెనాక్ సోడియం 50ఎంజీ ట్యాబ్లెట్లు.
* టాప్-డీ ట్యాబ్లెట్లు(పెంటాప్రజోల్, డోమిపెరిడిన్).
* సక్సినేట్ ఇంజెక్షన్స్ 100 ఎంజీ(హైడ్రాకాక్సిటోజోన్స్ సోడియం).
* మోనోసెఫ్ వో-200 ట్యాబ్లెట్లు(సెఫిక్జిమ్ 200 ఎంజీ) వీటిలో రెండు రకాలను గుర్తించారు.
* ప్యాంటాసిస్ డీఎస్ఆర్ క్యాప్సుల్స్(ఎంట్రిక్ కోటెడ్ ప్యాంటాప్రజోల్ సోడియం, డోమిపెరిడిన్).
* కాల్‌జెన్ డీ3(టానిక్) (క్యాల్షియం కార్బనేట్, మెగ్నిషియం హైడ్రాక్సైడ్, జింక్, కోల్‌కాల్సిఫెరాల్).
* ప్యాంటాప్ప-డీఎస్ఆర్ క్యాప్సుల్స్(ఎంట్రిక్ కోటెడ్ పెంటాప్రజోల్ సోడియం, డోమిపెరిడిన్ ఎస్‌ఆర్).