గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (20:23 IST)

ఆంధ్రప్రదేశ్ గ‌వ‌ర్న‌ర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ నూతన సంవత్సరం ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.

ఈ మేరకు రాజ్ భవన్ నుండి గురువారం ప్రకటన విడుదల చేశారు. 2021 నూతన సంవత్సరం ఆగమనం నేపధ్యంలో గవర్నర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తాజా పోకడలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ వేడుకలను జరుపుకోవాలన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాలని, నూతన సంవత్సర వేడుకలను సంయమనంతో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అయితే ప్రతి సంవత్సరం నూతన సంవత్సర తొలి రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో రాష్ట్ర ప్రజలు గవర్నర్‌ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షాలు తెలపటం అనవాయితీ కాగా, కరోనా నేపధ్యంలో ఈ విడత ఆకార్యక్రమానికి రాజ్ భవన్ దూరంగా ఉండనుందని గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు.