ఆదివారం, 27 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (13:27 IST)

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
పహెల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పలు వ్యాఖ్యలు చేసాడు. ''పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ల ప్రజలనే సరిగ్గా చూసుకోలేకపోతోంది. అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు. అసలు చాలామంది జీవితం దుర్భరంగా వుంది. వాళ్లంతా పాకిస్తాన్ ప్రభుత్వంపైన తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు తీర్చకుండా ఏవేవో మాటలు చెబుతున్నారు.
 
పాకిస్తాన్ పైన భారతదేశం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లపాటు వారిని అలానే వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు. కాశ్మీర్ యావత్తూ భారతదేశానిదే, కాశ్మీరీలు భారతీయులు, నేను ఖుషీ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లాను. అక్కడి స్థానికులు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. కనుక మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగితే చాలు. ఉగ్రవాదులు తోకముడుస్తారు. పహెల్గాం దాడిలో మరణించినవారికి నా నివాళులు'' అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ