మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 జులై 2018 (09:14 IST)

కాబోయే భార్య నగ్న దృశ్యాలు చూసిన వరుడు....

తనకు కాబోయే భార్య ఎంతో పవిత్రంగా, సంప్రదాయబద్ధంగా ఉండాలని ప్రతి వరుడూ కోరుకుంటారు. కానీ, ఈ వరుడు మాత్రం తనకు కాబోయే భార్య నగ్న దృశ్యాలు చూసి షాక్ తిన్నాడు. అంతే ఆమెతో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకున్

తనకు కాబోయే భార్య ఎంతో పవిత్రంగా, సంప్రదాయబద్ధంగా ఉండాలని ప్రతి వరుడూ కోరుకుంటారు. కానీ, ఈ వరుడు మాత్రం తనకు కాబోయే భార్య నగ్న దృశ్యాలు చూసి షాక్ తిన్నాడు. అంతే ఆమెతో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడిలో జరిగిందీఘటన.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. స్థానిక యువతికి, ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన యువకుడి‌తో పెళ్లి నిశ్చయమైంది. శనివారం వీరి వివాహం జరగాల్సి ఉంది. కొత్తలంకలో వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 
 
అంతలోనే అంటే పెళ్లికి ఒక్క రోజు ముందు (శుక్రవారం) వరుడు పేరుతో ఓ స్పీడు పోస్టులో కవర్ వచ్చింది. దాన్ని వరుడు విప్పి చూడగా, అందులో ఓ మొబైల్ ఫోన్ వుంది. ఆ ఫోన్‌లోని వీడియోలు ప్లే చేసి చూడాలని ఓ పేపర్‌పై రాసి ఉంది. దీంతో వరుడు ఆ వీడియోను తిలకించి తేరుకోలేని షాక్‌కు గురయ్యాడు. 
 
ఆ వీడియోల్లో వధువు స్నానం చేసిన అనంతరం దుస్తులు మార్చుకుంటున్నట్టు ఉంది. కాబోయే భార్య నగ్న దృశ్యాలను చూసిన వరుడు పెళ్లి చేసుకోబోనని తెగేసి చెప్పాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ వీడియోల్లో ఉన్నవి మార్ఫింగ్ చేసిన దృశ్యాలని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొరియర్ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.