శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 18 ఆగస్టు 2017 (22:29 IST)

శిక్షణ పొందని టీచర్లకు మరో అవకాశం... అర్హత సాధించే గడువు 2019 మార్చి 31

అమరావతి : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న శిక్షణ పొందని టీచర్లు తగిన అర్హత డీ.ఈఐ.ఈడీ పొందడానికి గడువును 2019 మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 2018

అమరావతి : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న శిక్షణ పొందని టీచర్లు తగిన అర్హత డీ.ఈఐ.ఈడీ పొందడానికి గడువును 2019 మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 2018 మార్చి 31 తరువాత  దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలో శిక్షణ పొందిన టీచర్లు మాత్రమే పనిచేయాలి. ఆర్ఈటీ-2009 సెక్షన్ 23(2)లో చేసిన సవరణ ప్రకారం అర్హత పొందే కాల పరిమితిని 2019 మార్చి 31 వరకు పొడిగించారు. 
 
శిక్షణ పొందని టీచర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిర్ణయించిన తేదీ లోపల నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఓపెన్ స్కూల్(ఎన్ఐఓఎస్) నుంచి డీ.ఈఐ.ఈడీ సర్టిఫికెట్‌ను పొందాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ తెలిపినట్లు ఆ ప్రకటనలో కమిషనర్ పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం దేశంలో ప్రభుత్వ పాఠశాలలో 5,11,679 మంది, ప్రైవేటు పాఠశాలలో 5,97,765 మంది మొత్తం 11.09 లక్షల మంది శిక్షణ పొందని టీచర్లు పనిచేస్తున్నారు. 
 
రాష్ట్రంలోని 5149 ప్రభుత్వ, 87 ప్రైవేటు పాఠశాలలో 5236 మంది శిక్షణ పొందని టీచర్లు పని చేస్తున్నారు. నిర్ణయించిన తేదీ లోపల అర్హతలు సాధించని టీచర్లను 2019 ఏప్రిల్ 1 నుంచి తొలగిస్తారని కమిషనర్ తెలిపారు. అలాగే 2017 ఆగస్ట్ 16 నాటికి కనీసం రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్ ఎన్ఐఓఎస్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్(ఓడిఎల్) ద్వారా 18 నెలలలు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్ పాఠశాల విద్యా శాఖకు చెందిన cse.ap.gov.in వెబ్ సైట్లో లాగిన్ అయి శిక్షణ పొందని టీచర్లకు చెందిన సర్వీస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్, ఇతర వివరాలు ఈ నెల 20 నుంచి 30వ తేదీ లోపల అప్ లోడ్ చేయాలని తెలిపారు. 
 
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపిన ప్రకారం ఈ నెల 20వ తేదీ లోపల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఇన్ సర్వీస్‌లో ఉన్న శిక్షణ పొందని టీచర్ల వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఐఓఎస్‌కు పంపాలని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 17 వరకు అడ్మిషన్లు జరుగుతాయని, సెప్టెంబర్ 20న మొదటి బ్యాచ్ మెటీరియల్ ఎన్ఐఓఎస్ స్వయం పోర్టల్లో అప్‌లోడ్ చేస్తారని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి కోర్స్ ప్రారంభమవుతుందని, అక్టోబర్ 3 నుంచి 2018 జూన్ 18 వరకు ఫస్ట్ టెర్మ్ అని, జూన్ 25 నుంచి 2019 మార్చి వరకు రెండవ టర్మ్ అని ఆ ప్రకటనలో కమిషనర్ వివరించారు.