శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 18 ఆగస్టు 2017 (21:54 IST)

23న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వేతనంతో కూడిన సెలవు దినం : సిఎస్

అమరావతి: ఈ నెల 23వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఆ తేదీన ఆ నియోజకవర్గ పరిధి లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవు

అమరావతి: ఈ నెల 23వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఆ తేదీన ఆ నియోజకవర్గ పరిధి లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ జిఓఆర్టి నంబరు 1820 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
23వ తేదీ బుధవారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర సంస్థలు, మరే ఇతర ఎస్టాబ్లిష్మమెంట్లలో పనిచేసే ఉద్యోగులు వారి ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఆ రోజున వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ ఆయన ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ఎక్ట్స్-ఆర్డినరీ గెజిట్‌లో కూడా ప్రచురించడం జరుగుతుందని సిఎస్ దినేష్ కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.