గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (16:15 IST)

బోరున విలపించిన మంత్రి అమర్నాథ్... అనకాపల్లిని వదిలి వెళ్లడం ఇష్టం లేదంటూ...

gudivada amarnath
ఏపీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి అమర్నాథ్ బోరున విలపించారు. అనకాపల్లి నియోజకవర్గ కొత్త సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త సమన్వయకర్తను పరిచయం చేస్తూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనకాపల్లిని వదిలి వెళ్లడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇన్ని రోజులు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్టు చెప్ప భావోద్వేగానికి గురయ్యారు. పైగా, మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదని, మీ ఎప్పటికైనా తీర్చుకుంటానని, అదేసమయంలో కొత్త అభ్యర్థిని గెలిపించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని ఆయన కోరారు. 
 
అలాగే, మీడియా సంస్థలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిపత్రికలు, చానళ్లు ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నాయన్నారు. తన పని అయిపోయిందని అదే పనిగా ప్రచారం చేస్తున్నాయని వాపోయారు. అయితే, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, చిన్న వయసు నుంచే బాధలు పడ్డానని తెలిపారు. ఇలాంటి వార్తల వల్ల తానేమి కుంగిపోనని చెప్పారు. వైకాపాలా అన్నింటికి కంటే పెద్ద పదవి ఒకటి ఉందని, అదే వైకాపా కార్యకర్త పదవి అని అది ఉంటే చాలని, ఇంకేమీ అక్కర్లేదని చెప్పారు. తాను సాధారణ కార్యకర్తలా పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.