సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆ 16 మంది ఐపీఎస్‌లకు షాక్... మెమోలు జారీ చేసిన ఏపీ డీజీపీ!!

Dwaraka Tirumala Rao
గత వైకాపా ప్రభుత్వంలో వైకాపా మంత్రులు, అధికార నేతల ఒత్తిడికి తలొగ్గి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఐపీఎస్ అధికారులు ఎదురయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ప్రస్తుతం వెయిటింగ్‌ జాబితాలో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు మెమోలు జారీ చేశారు.
 
వెయిటింగ్‌లో ఉండి హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేనివారికి మెమోలు ఇచ్చారు. పీఎస్సార్‌ ఆంజనేయులు, సునీల్‌కుమార్‌ సహా 16 మందికి మెమోలు జారీ చేశారు. సంజయ్‌, కాంతిరాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్‌ గున్ని, రవిశంకర్‌ రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, కృష్ణకాంత్‌ పటేల్‌, పాలరాజుకు మెమోలు ఇచ్చారు. 
 
ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రతి రోజూ ప్రధాన కార్యాలయంలో రిపోటు చేయాలని డీజీపీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, పైన పేర్కొన్న అధికారులు వైకాపా ప్రభుత్వంలో ఇష్టాను రీతిలో అఖిల భారత సర్వీసులకు విరుద్ధంగా నడుచుకుని ఇపుడు సమస్యలను ఎదుర్కొంంటున్నారు.