శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (21:54 IST)

రాజధాని కోసం ఆగిన మరో గుండె

రాజధాని అమరావతి తరలిపోతుందనే మనస్థాపంతో మరో గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన మహిళా రైతు పువ్వాడ వెంకాయమ్మ(55) గుండెపోటుతో మృతి చెందింది.

శనివారం సాయంత్రం వరకు దీక్షా శిబిరంలోనే వెంకాయమ్మ ఉన్నారు. రాజధాని కోసం నలుగురు యువకులు సెల్‌టవర్‌ ఎక్కారనే విషయం తెలుసుకున్న వెంకాయమ్మ తీవ్ర ఆందోళనకు గురైంది. తన బిడ్డలకు కూడా రేపు ఇదే పరిస్థితి వస్తుందని ఆందోళన చెంది ఇంటికొచ్చి వెంకాయమ్మ కుప్పకూలిపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

వెంకాయమ్మ మృతితో తుళ్లూరులో విషాదఛాయలు అలముకున్నాయి. జిల్లాలోని నేలపాడులో శుక్రవారం ఇందుర్తి సుబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. మూడు రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బమ్మ గుండెపోటుతో మృతి చెందింది.

రాజధాని కోసం ఇప్పటి వరకు దాదాపు 11 మంది రైతులు, రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాజధానిగా అమరావతినే కొనసాగాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 32వ రోజుకు చేరింది. మూడు రాజధానులు వద్దు అంటూ రైతులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.