సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (03:11 IST)

దొనకొండను రాజధాని చేయాలి: మంద కృష్ణ

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా రాయలసీమ వాసులే ఉన్నారని, రాయలసీమకు ఏమిచేయలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు.

తుగ్గలి నాగేంద్ర ఇంటికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కాదని మరల ఇప్పుడు రాజధానులు మార్చడం అంటే కొత్త రాష్ట్రాలకు నాంది పాలికినట్టేనని అన్నారు.

రాయలసీమ అభివృద్ధి చెందాలంటే దొనకొండను రాజధాని చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అయితే హైకోర్టును కర్నూల్‌లో ఏర్పాటు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.